Saturday, December 21, 2024

12 జ్యోతిర్లింగ రామ కథా యాత్రపై డాక్యుమెంటరీ

- Advertisement -
- Advertisement -

ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు 2024 జూలై 21న గురు పూర్ణిమ శుభ సందర్భంగా రెండు ఆకర్షణీయమైన కొత్త పుస్తకాలతో పాటు ఆకట్టుకునే రీతిలో ఒక డాక్యుమెంటరీ చిత్రంను విడుదల చేశారు. ఆధ్యాత్మిక పరిజ్ఞానం మరియు వ్యక్తిగత అనుభవాలతో కూడిన ఈ పుస్తకాలు, చిత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తాయి మరియు స్ఫూర్తిని అందిస్తాయి.

సినిమా మరియు పుస్తకాల విడుదల సందర్భంగా బాపు తన ఆనందాన్ని వ్యక్తం చేసి, శుభప్రదమైన ‘యోగ్’ని సూచించారు. ఈ పుస్తకాలు, చిత్రం విడుదల చేసిన 2024 జూలై 21 వ తేదీకి ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే అద్భుతమైన 12 జ్యోతిర్లింగ రామ కథా యాత్రను ప్రారంభించడానికి యాత్రికులు కేదార్‌నాథ్ చేరుకుని తమ యాత్రని సరిగ్గా సంవత్సరం క్రితం అంటే 2023 జూలై 21న వారు యాత్ర ప్రారంభించారు.

డాక్యుమెంటరీ చిత్రం: రైలులో మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ కథా యాత్ర

ఆధ్యాత్మిక వేత్త మొరారీ బాపు యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ రామ కథా యాత్రపై ఒక గంట డాక్యుమెంటరీ చిత్రం ద్వారా , జూలై-ఆగస్టు 2023లో అతను మరియు అతని 1008 మంది అనుచరులు చేపట్టిన విశేషమైన తీర్థయాత్రను అందంగా పొందుపరిచారు. రెండు రైళ్లలో ఒకదానిలో ప్రయాణించిన ప్రత్యేక బృందం, నెలల తరబడి ఈ చిత్రం చిత్రీకరించింది. ఇది భక్తులు, మొరారీ బాపు యొక్క అభిప్రాయాలతో సహా ప్రయాణంలోని అన్ని ప్రధాన

ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక యాత్ర పన్నెండు జ్యోతిర్లింగాల పవిత్ర మార్గాన్ని కవర్ చేసింది, ఇవి శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ఈ ప్రయాణం 18 రోజుల పాటు 12,000 కిలోమీటర్లు విస్తరించి వుంది, మంచుతో నిండిన హిమాలయ శిఖరాల మీదుగా పచ్చని లోయలు మరియు విశాలమైన సముద్ర తీరాల వరకు ఈ యాత్ర సాగింది. మొరారీ బాపు మరియు ఆయన భక్తులు గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని మహువ జిల్లాలోని అతని స్వగ్రామమైన తల్గజరడలోని చిత్రకూట్‌ధామ్‌లో డాక్యుమెంటరీ ప్రీమియర్‌ను వీక్షించారు.

పుస్తకాల గురించి

1. జర్నీ విత్ యాన్ ఇన్విజిబుల్ పవర్ ( ఒక అదృశ్య శక్తితో ప్రయాణం) : “జర్నీ విత్ యాన్ ఇన్విజిబుల్ పవర్” అనేది పన్నెండు జ్యోతిర్లింగాల చారిత్రాత్మక తీర్థయాత్రను వివరించే విశేషమైన యాత్రా గ్రంథం. మొరారీ బాపు మరియు యాత్రికులు ప్రతి జ్యోతిర్లింగం వద్ద దైవ దర్శనాన్ని కోరుకున్నారు మరియు రామ్ కథ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగంలో మునిగిపోయారు. ప్రతి పవిత్ర స్థలానికి సంబంధించిన కథలు, జానపద కథలు మరియు ఇతిహాసాలను బాపు వెల్లడించారు.

ప్రతి గమ్యం యొక్క సారాంశాన్ని అన్వేషిస్తూ, దేవాలయాలతో ముడిపడి ఉన్న చరిత్ర, వాస్తు శైలి మరియు ఇతిహాసాలను పరిశోధిస్తూ సాగే ఈ పుస్తకం ప్రయాణంలోని కవితా సౌందర్యాన్ని అద్భుతంగా సంగ్రహిస్తుంది. మొరారీ బాపు అనుసరించిన విధానాన్ని ఇది మొట్టమొదటిసారిగా ఆవిష్కరిస్తుంది. ప్రయాణం గురించి మరియు బాపు స్వంత ప్రయాణంలోని అనేక కోణాలను నిశితంగా ఈ పుస్తకం పరిశీలిస్తుంది.

ఈ పుస్తకం అమెజాన్ ఇండియాలో https://www.amazon.in/dp/9364524829?ref=myi_title_dp వద్ద అందుబాటులో ఉంది.

2. సాక్రెడ్ స్టోరీస్ ఫ్రమ్ ది 12 జ్యోతిర్లింగాస్ ( 12 జ్యోతిర్లింగాల నుండి పవిత్రమైన కథలు) : వినూత్నమైన 12 జ్యోతిర్లింగ రామ్ కథా యాత్రను అనుసరించి, మొరారీ బాపు తన అనుచరులను భౌతికంగా ప్రయాణించినా వారి అనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించారు. వారు తమ అనుభవాలను హిందీ మరియు ఇంగ్లీషు రెండింటిలోనూ చెప్పేందుకు అంగీకరించారు. భక్తుల యొక్క విభిన్న అనుభవాలను సంగ్రహించే హృదయపూర్వక కథనాల భాండాగారాన్ని ఇది సృష్టించింది.

ఈ పుస్తకాన్ని వైవిధ్యంగా ఉంచేది ప్రామాణికత పట్ల దాని నిబద్ధత. వాస్తవిక భావాలు మరియు వ్యక్తిగత అనుభవాలను సంరక్షిస్తూ, భక్తుల భాష మరియు భావోద్వేగాల వెల్లడి కి ఎటువంటి మార్పు లేకుండా అలాగే పుస్తకం లో ప్రచురించబడ్డాయి. ప్రతి కథనం భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంను సంపూర్ణంగా ఒడిసిపడుతుంది.

ఈ సంకలనం దైవిక అనుసంధానం మరియు అంతర్గత మేల్కొలుపు యొక్క సార్వత్రిక అన్వేషణను వేడుక జరుపుకుంటుంది. ఇది భక్తి భావంలోని అందాన్ని మరియు మహాదేవ్ యొక్క దయ మరియు ఆశీర్వాదాలను సాధకులు అనుభవించే అనేక మార్గాలను ప్రదర్శిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News