Friday, November 22, 2024

హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మ హానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఒక ఐకాన్‌గా గుర్తింపు పొందిందని, ఈ నే పథ్యంలోనే ఈ బడ్టెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్ ప్రసంగించారు. ఇందులో మెట్రో వాటర్ వర్క్, ఔటర్ రింగ్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళ న వంటివి ఉన్నాయని  హైదారాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఈ నిధులను పూర్తి స్థాయిలో ఆయా సంస్థల అభివృద్ధి కోసమే వాడతామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం హైదరాబాద్ నగర సుందరీకరణకు, మౌలిక వసతుల రూపకల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో బ్రాండ్ హైదరాబాద్ పేరును నిలబెడతామని ప్రపంచం లోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్‌ను నిలుపుతామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News