Monday, December 23, 2024

మరో 7,024 ఇంజనీరింగ్ సీట్లకు అనుమతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో మరో 7,024 ఇంజనీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో మొత్తం 78,694 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 75,200 సీట్లు కేటాయించారు.

అందులో 55,941 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా రిపోర్ట్ చేశారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 22,753 సీట్లు ఖాళీగా మిగిలాయి. తాజాగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 7,024 సీట్లతో కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో 29,777 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నేడు, రేపు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం(జులై 27) సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు శని, ఆదివారాలు(జులై 27,28) గడువు ఇచ్చారు. ఈ నెల 31న రెండో విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News