Saturday, December 21, 2024

శ్రీపాద ఎల్లంపల్లి, సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఎగువన భారీ వర్షాలు కురవడంతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.17 టిఎంసిలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 16.91 టిఎంసిలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 14,349 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 331 క్యూసెక్కులు ఉంది.

సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.91 టిఎంసిలు ఉండగా నీటి సామర్థ్యం 14.06 టిఎంసిలుగా ఉంది. సింగూరు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1595, ఔట్‌ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News