హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి ఈ మధ్యనే తేరుకున్నామో లేదో మరో సరికొత్త వైరస్ హైదరాబాద్ లో వేగంగా వ్యాపస్తోంది. దానిని ‘నొరో వైరస్’ అంటున్నారు. ఈ వైరస్ పై జిహెచ్ఎంసి హెచ్చరికలు చేసింది. ఎక్స్ వేదికగా పలు సూచనలు చేసింది.
నొరో వైరస్ లక్షణాలు: చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రెషన్. దీని బారిన పడకుండా ఉండాలంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగుకోవాలి. కాచి చల్లార్చి, వడబోసిన నీరు త్రాగాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రస్తుతం ఈ వైరస్ యాకుత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలి, మొఘల్ పురా వంటి పలు ప్రాంతాలలో వ్యాపిస్తోంది. చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరుతున్నారు కూడా!
నొరోవైరస్ వ్యాధితో జాగ్రత్త!!
కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్.తీసుకోవాల్సిన జాగ్రత్తలు
👉 చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
👉కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
👉ఇంటిని,… pic.twitter.com/n3IcqPC2w6— GHMC (@GHMCOnline) July 27, 2024