- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైద్రాబాద్ కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేశానని గుర్తు చేశారు. నాడు ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి కూడా వెళ్లినట్లు తెలిపారు. పోరాడి తెచ్చుకున్న మెట్రో రైలు సేవలు తన ప్రాంతానికే లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదన్నారు. పాత బస్తీకి మెట్రో రైలు సేవలను విస్తరించాలని కోరారు.
- Advertisement -