Monday, December 23, 2024

ఎంపి రఘునందన్‌రావుకు మతి భ్రమించింది:అడ్లూరి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు మతి భ్రమించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చదువుకున్నారో చెప్పగలరా అని బీజేపీ ఎంపీని ఉద్దేశిస్తూ వారు ప్రశ్నించారు. వారు శనివారం అసెంబ్లీలోని మీడియాపాయింట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్నది ఏడో తరగతని, ఆయన చేసే పని గోడలకు వేసే సున్నమని, అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతమైన బడ్జెట్ పెడితే వక్రీకరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి నిధులు తీసుకురాకుండా ఉత్తి చేతులతో వస్తే ప్రజలు ఛీ కొడతారని, అందుకే ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కుర్చీ కోసం పెట్టినట్లు ఉందని వారు విమర్శించారు.

రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని వారు సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. బీఆర్‌ఎస్ అమ్ముడుపోవడం వల్లే బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచిందని వారు ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు అవడం వల్లే ఎంపీగా గెలిచావని రఘునందన్‌రావును విమర్శించారు. కేసీఆర్ పక్కన ఉండి వెన్నుపోటు పొడిచావని ఆరోపించారు. రఘునందన్ రావు ఎంపీగా ఎట్లా గెలిచారో రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురావడం చేతకాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చదువు మీద, పనితీరు మీద మాట్లాడుతున్నారని అన్నారు. ఒక మంచి ఆదర్శనీయమైన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడితే దాని మీద కూడా అవహేళన చేసి మాట్లాడుతున్న ఎంపీ రఘనందన్ రావుకు తెలంగాణ ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News