Thursday, September 19, 2024

భద్రాజలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం: ఎగువ ప్రాంతాల్లో గత వా రం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గో దావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వ ద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం సాయంత్రానికి నదిలో నీటిమట్టం 53.2అడుగులకు చేరటంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశా రు. పైనుంచి వరద నీరు వస్తుండటంతో న దిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లో తట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమ ట్టం మళ్లీ పెరిగింది. శుక్రవారం రాత్రి వర కు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం,

తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాం తాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు గా, రాష్ట్రవ్యాప్తంగా  కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరి నీటిమట్టం 52.4 అడుగుల వద్ద ప్రవహించిన వరదనీరు క్రమంగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.2 అడుగులకు చేరడంతో అధికారులు చివరి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలో వరద ప్రవాహం 12.38లక్షల క్యూసెక్కులకు చేరిందిపట్టణంలోని ఏఎంసీ కాలనీలోని మురుగునీరు గోదావరిలో కలవడానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాలనీలోకి మురుగు నీరు చేరడంతో సుమారు 80 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.ఇప్పటికే ప్రాణహిత నుంచి మేడిగడ్డ వద్ద గోదావరిలోకి 5.39లక్షల క్యూసెక్కలు నీరు చేరుతోంది.తుపాకుల గూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజికి 9.75లక్షల క్యూసెక్కల ప్రవాహం కొనసాగుతోంది. దుమ్ముగూడెం వద్ద 13.95లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.

శ్రీరాంసాగర్‌కు పెరిగిన వరద:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. జలశయానికి 30554 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుత నీటినిల్వ 1073.60 అడుగులకు చేరుకుంది. శ్రీరాంసాగర్ నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం నీటినిల్వ 31.26 టీఎంసీలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టు నుంచి 7120క్యూసెక్కులనీటిటి విడుదల చేస్తున్నారు.
కృష్ణమ్మ పరవళ్లు ..శ్రీశైలంలో 127టిఎంసీలు
కృష్ణమ్మ వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.12లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజ్టెలో నీటిమట్టం 866.40అడుగులకు చేరుకుంది .నీటినిలువ 127.60టిఎంసీలకు పెరిగింది. కుడి , ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు 74,258క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

జూరాల : జూరాల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 42గేట్ల ద్వారా 3.16లక్షల క్యూసెక్కుల నీరు కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల జలశయానికి 9.65 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 7.74టీఎంసీలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయానికి నీటిప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులకుగాను 507.80అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 127.97టీఎంసీల నీటి నిలువలు ఉన్నాయి. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 52,559 క్యూసెక్కులు కాగా, 6,253క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News