Thursday, December 19, 2024

వార ఫలాలు(28-07-2024 నుండి 03-08-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం  అనుకున్న విధంగా కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. పోటీపరీక్షలు గ్రూప్స్‌కి, సివిల్‌ సర్వీసులకు ప్రయత్నం చేసే వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆగిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేస్తారు. ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవారు ఈ వారం జాగర్త వహించాలి. మానసిక వత్తిడిని తగ్గించు కోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు.వ్యవసాయ పనులు కొంత ఆలస్యంగా సాగుతాయి.  దూర దృష్టితో వ్యవహరిస్తారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  జీవిత భాగస్వామతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి.  సకుటుంబ సపరివారంగా దేవాలయాలను సందర్శిస్తారు.ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన అలాగే గణపతికి గరికతో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినది. అనారోగ్యకర పరిస్థితులను అధిగమించి, ఆరోగ్యకరమైన వాతావరణంలో అడుగుపెడతారు. మీరు ద్రోహం చేస్తారని భయపడిన వ్యక్తులే మీకు అన్ని విధాలా  సహాయపడటం  మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విదేశీ విద్యా, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కళా, సాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి ఈ వారం బాగుంది. మీ ప్రతిభా పాటవాలు విశేషమైన గుర్తింపుకి నోచుకుంటాయి.  సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతతను ఏర్పరచుకునేందుకు . ఈ రాశి వారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన, అలాగే మేధాదక్షిణా మూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం ఆర్థిక వ్యవహారాల మినహా మిగతా విషయాలు అనుకూలంగానే ఉంటాయి. ఉన్నతాధికారులతో జరిపే చర్చల వలన లాభపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలుగా మంచిది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి.నూతన వ్యాపారాలు ప్రారంభించి, ఆశించిన లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణ సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి.ముఖ్యమైన విలువైన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన విద్యా విషయంలో అధిక శ్రద్ధను కనబరుస్తారు. జీవిత భాగస్వామితో స్వల్చమైన విభేదాలు తప్పక పోవచ్చు.ఈ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత వరకు నిరాశ తప్పక పోవచ్చు. ఉద్యోగాలలో బదిలీలు మరియు అదనపు బాధ్యతలు ఉంటాయి. జీవితభాగస్వామి, సంతానం మొదలైన కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.డాక్టర్‌లకు, లాయర్‌లకు, ఇబ్బంది లేనటువంటి కాలం . విద్యా సంబంధమైన విషయాలలో, పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విదేశాలలో చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ఎన్ని వున్నా ఎదో తెలియని బాధ వెంటాడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది. ఆధ్యాత్మిక భావన వలన కొంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సంతాన పురోగతి మీరు గర్వించే విధంగా ఉంటుంది.ఈ రాశి వారు అష్టమ శని నడుస్తున్నది వలన , 8  శని వారాలు శని కి తైలాభిషేకం చేయడం మంచిది అని చెప్పదగిన సూచన.

సింహం: సింహరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా మార్పులు, చేర్పులు ఉండవు. మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపార పరంగా స్వల్ప అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా రావలసిన పెండింగ్‌ బిల్స్‌ ఓ కొలిక్కి వస్తాయి. లీజులు లైసెన్స్‌లు తిరిగి  పొందడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.రాజకీయపరమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. న్యాయబద్ధమైన మీ వాదనలకు పదిమంది మద్ధతు లభిస్తుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కళా సాహిత్య రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు. సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. విందు, వినోదాల ద్వారా పరిచయాలను పెంచుకోవడానికి అనువైన మార్గాలు లభిస్తాయి.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ స్థాన చలనానికి ఇతరుల ప్రయత్నిస్తారు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. భయంభయంగా కార్యక్రమాలు చేపట్టినా వాటివల్ల పూర్తి స్థాయిలో కాకపోయినా అంతో ఇంతో ఫలితం ఉంటుంది. నూతన బ్యాంకు ఋణాలు ఊరటనిస్తాయి. వ్యవసాయ సంబంధమైన విషయాలు బాగుంటాయి. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వృత్తులు బాగుంటాయి. విద్యారంగంలోని వారికి, విద్యాసంస్థలను నడుపుతున్నవారికి కాలం అనుకూలంగా ఉంది. వివాదాలకు దూరంగా, సమాజానికి దూరంగా మీ పని మీరు చేసుకుంటూ పోతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా తారసపడతారు.

తుల: తులా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన .ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యారంగంలోనూ పోటీ పరీక్షలకు సంబంధించిన వ్యవహారాలలోనూ, వ్యాపారంలోనూ నామమాత్రపు ఫలితాలే చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఆటుపోట్లు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. డబ్బు సంపాదించడానికి నూతన అవకాశాలు లాభిస్తాయి. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  కళారంగాలలో ఉన్న వారికి ముఖ్యమైన సమావేశాలకు, సభలకు, ఆహ్వానాలు అందుతాయి. సంతృప్తిని అలవరచుకుంటే జీవితం సుఖమయం అవుతుందని భావిస్తారు. .

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం  అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారులకు నచ్చిన విధంగా బాధ్యతలను పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన చోట బదిలీ జరుగుతుంది. సమాజ పరిస్థితులను అర్థం చేసుకుని వీలైనంత వరకు చాలా విషయాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలకు అడ్డదారులు ఎంతమాత్రం త్రొక్కరు.గృహనిర్మాణ సంబంధమైన మీ కోరిక నెరవేరుతుంది.  ఆత్మీయవర్గం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే వారిని మందలించి సరియైన దారిలో పెడతారు.వాహన సంబంధమైన విషయాలలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని శ్రమించి పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు అడ్డంకిగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు. ఉద్యోగంలో మరింత అనుకూలతను సాధించటానికి అవసరమైన వ్యూహ రచనలు చేస్తారు.భాగస్వామ్య వ్యాపారాలలో ఎప్పటి నుండో ఉన్న ఒకటి, రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయ పలుకుబడి సాధించటానికి వ్యూహాలు కదుపుతారు. గతంలో కొనుగోలు చేసిన భూమికి ధర పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టెక్నికల్‌ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది.కుటుంబంలో ప్రశాంత వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మానసికమైన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

 

మకరం:   మకర రాశి వారికి  ఈ వారం  సానుకూల ఫలితాలు  ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఉందే అవకాశం ఉంది.  నేత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేసి ఇబ్బందిపడే అవకాశం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం బంధు వర్గానికి సహాయం చేస్తారు.పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టులను ఆశ్రయించే పరిస్థితి రావచ్చు. ఎ.టి.ఎం. కార్డులు, క్రెడిట్‌ కార్డులు, మొదలైన వాటి విషయంలో భద్రత అవసరం. టి.వి. రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ  వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్న టెన్షన్‌ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కాస్త నిరాశపరుస్తాయి. బాల్యమిత్రుల కలయిక ఓ చిన్న వ్యాపారానికి దారి తీస్తుంది.  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల విచిత్ర ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. విదేశాలలో ఉన్న మీ వారికి ఉద్యోగం దొరుకుతుంది. గ్రీన్‌కార్డ్‌ లభిస్తుంది. పిల్లల్ని చదివించటానికి ఫీజులు, స్సూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు మీరు భరించలేనంత ఆర్థికభారం అవుతుంది.  సనాతన సాంప్రదాయాల పట్ల ఆచార, వ్యవహారాల పట్ల గౌరవం కలిగి ఉంటారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునేవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధలకు, కష్టాలకు, దూరంగా ఉంటారు. గృహాలంకరణకు, సౌందర్య పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  ఆహార, ఆరోగ్య నియమాలను పాటించాలని భావిస్తారు..

­ మీనం: మీనరాశి వారికి ఈ వారం  అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆదాయం క్రమంగా పెరగడమే  తప్పా తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. చేస్తున్న వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు రావడం మీ మానసికమైన సంతోషానికి కారణంఅవుతుంది. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే వారికి డిప్యుటేషన్‌ మీద మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా మీ సీనియారిటీ ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.  పిల్లలు మీ మీద చూపించే అభిమానం మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. వాళ్ళు చేసిన తప్పులు కూడా మీరు మరిచిపోతారు. భూములకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన నిర్ణయాలను కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చేస్తారు. గృహంలో సందడిగా, సరదాగా  ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు బాగుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News