- Advertisement -
హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్ఏ రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలకు మరిగారని అన్నారు. ఏ పని చేయాలన్న డబ్బులు ముట్టాలంటున్నారని తెలిపారు. హైదరాబాద్ లో అక్రమ కోచింగ్ సెంటర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయన్నారు. అనుమతులు వేటికి ఉన్నాయో, వేటికి లేవో లెక్కలు లేవన్నారు. తాము గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అక్రమ కోచింగ్ సెంటర్ల విషయంలో కొత్త కమిషనర్ దృష్టి పెట్టాలన్నారు. ఇదిలావుంటే ఢిల్లీ వరదల్లో మృతి చెందిన నగర యువతి తన్యా సోనీ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
- Advertisement -