Friday, January 10, 2025

ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై రాహుల్ గాంధీ స్పందన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో భారీ వానల కారణంగా సివిల్స్ శిక్షణా కేంద్రంలోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారన్నది తెలిసిన విషయమే. కాగా మృతుల కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘‘ఈ దుర్ఘటన వ్యవస్థల వైఫల్యం, అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్లానింగ్, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్యులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని చాటుతోంది.  సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతి పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత’’ అంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News