- Advertisement -
తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు జరగడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఒక సైనికుడు వీరమరణం పొందడం, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంఘటనపై ప్రియాంక తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అమరుడైన సైనికుని ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ఆ కుటుంబానికి సంతాపం వెలిబుచ్చారు. కేంద్రంలో మళ్లీ ఎన్డీఎ అధికారం లోకి వచ్చిన తరువాత గత 49 రోజుల్లో14 ఉగ్రదాడులు జరిగాయని, 15 మంది సైనికులు వీరమరణం పొందారని, ఇది దేశానికే ఆందోళన కలిగించే విషయమని ప్రియాంక వివరించారు.
- Advertisement -