సామ్‌సంగ్ తన గెలాక్సీ జెడ్ ఫోల్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, వాచ్ అల్ట్రా , వాచ్ 7, బడ్స్ 3 ఉత్పత్తులకు అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఆరో తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు, ఎకో సిస్టం ఉత్పత్తులు- గెలాక్సీ జెడ్ ఫోల్ 6, గెలాక్సీ జె డ్ ఫ్లిప్ 6 గెలాక్సీ వాచ్ అల్ట్రా, వాచ్ 7, బడ్స్ 3 ఇ ప్పుడు తక్కువ ధరకే వినియోగదారులకు సమీపంలోని రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు సామ్‌సంగ్.
కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చు. గత ఫోల్డబుల్‌లతో పోలి స్తే మొదటి 24 గంటల్లో 40% అధిక ప్రీ-ఆర్డర్‌ల ను ఇవి పొందాయి. గెలాక్సీ జెడ్ ఫోల్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 లు అత్యంత సన్నని, తేలికైన గెలాక్సీ జెడ్ సిరీస్ పరికరాలు సంపూర్ణ సిమెట్రికల్ డిజైన్‌తో వస్తాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్6 రూ.1,09, 999తో ప్రారంభమవుతుంది. గెలాక్సీ జెడ్ ఫోల్ 6 రూ. 1,64,999 వద్ద ప్రారంభమవుతుంది.