Thursday, September 19, 2024

‘రేవు’ మంచి సక్సెస్ సాధించాలి: తమన్నా

- Advertisement -
- Advertisement -

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది, మిల్కి బ్యూటీ తమన్నాలు ఓదెల 2 సెట్స్‌లో రేవు రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ‘రేవు సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంది, ఈ సినిమా సక్సెస్ సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలను కోరుకుంటున్నా’ అని అన్నారు. డైరెక్టర్ సంపత్ నంది మట్లాడుతూ.. ‘ఈ సినిమా మంచి విజయం సాధించాలని టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో వంశీ, హేమంత్, పారుపల్లి అనీల్, బిడిఎల్ నగేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News