- Advertisement -
ఫైనల్లో అనుకున్నంతగా రాణించలేకపోయామని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపారు. ఈ టోర్నీలో మేం ఓటమిలేకుండా ఫైనల్లోకి వచ్చామని, కానీ కీలక మ్యాచ్‌లో చాలా తప్పిదాలు చేయడంతోనే ఓటమికి దారితీశాయని వివరించారు. తాము విధించిన లక్ష్యం పోరాడదగినదేనని చెప్పారు. పవర్ ప్లేలోనే శ్రీలంకను దెబ్బతీయాలనుకున్నాం కానీ మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యామని బాధను వ్యక్తం చేశారు. లంక బ్యాటర్లు సైతం అద్భుతంగా ఆడారని కొనియాడారు. అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో మేం చాలా నేర్చుకోవాల్సి ఉంది’ అని భారత జట్టు సారధి హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొన్నారు.
- Advertisement -