Friday, November 22, 2024

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశాల నుంచి 4.36 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టిఎంసిలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 171.86 టిఎంసిలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు 62,587 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైల నుంచి పోతి రెడ్డిపాడుకు 15,792 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 511.4 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ నీటినిల్వ సామర్థం 312.50 టిఎంసిలుండగా ప్రస్తుత నీటినిల్వ 134.05 టిఎంసిలుగా ఉంది. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 54,438, ఔట్‌ఫ్లో 6744 క్యూసెక్కులుగా ఉంది. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News