Thursday, September 19, 2024

సిఐడికి జిఎస్‌టి స్కామ్?

- Advertisement -
- Advertisement -

మన వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కీలకంగా వ్యవహారించినట్టు ఇప్పటికే సిసిఎస్ ఆధారా లు సేకరించింది. ఈ కేసు ఇతర రాష్ట్రాల్లోతోనూ సంబం ధం ఉన్న నేపథ్యంలో ఈ కేసును సిఐడికి అప్పగించాల ని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను కూడా అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం. స్పె షల్ ఇన్షియేటివ్స్ వాట్సాప్ గ్రూపులో మాజీ సిఎస్ సో మేశ్ కీలకంగా ఉన్నారని తేలడంతో సిసిఎస్ పోలీసులు సోమేష్‌కుమార్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ. 1,400 కోట్ల కుంభకోణం జరిగిందని దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం సిద్ధమయినట్టుగా తెలిసింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సిఎం రేవం త్ రెడ్డి అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉం దని తెలుస్తోంది. దీంతోపాటు ఈ కుంభకోణంతో సం బంధం ఉన్న అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటుతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ అవినీతిలో భాగస్వాములైన పలు కంపెనీలు, వ్యక్తుల నుంచి రికవరీ యాక్ట్ ను ప్రయోగించి ప్రభుత్వం నష్టపోయిన రూ.1400 కో ట్లను రికవరీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఈ శాఖలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతుండగా తాజాగా ఈ పెద్ద కుంభకోణంలో పలువురు ఆ శా ఖకు చెందిన అధికారులతో పాటు మాజీ సిఎస్, పలు కంపెనీలు భాగస్వాములు కావడం విశేషం.

‘మన తెలంగాణ’ ఆనాడే చెప్పింది
అయితే వాణిజ్య శాఖలో జరిగిన కుంభకోణం గురించి ‘మనతెలంగాణ దినపత్రిక’లో ఫిబ్రవరి 24వ తేదీన ‘కమర్షియల్ ట్యాక్స్‌లో కాసుల కనికట్టు’ పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో అప్పటి సి ఎస్ సోమేష్‌కుమార్ నియమించుకున్న కన్సల్టెంట్ గురిం చి, ఐఐటీ ప్రొఫెసర్లు, కమర్షియల్ ట్యాక్స్‌లోని కొందరు అధికారులు అవినీతి గురించి, ఐదేళ్ల పాటు జరిగిన అవి నీతి గురించి ముందుగానే ‘మనతెలంగాణ దినపత్రిక’ బయటపెట్టింది. దీంతోపాటు కొందరు అధికారుల ఫోన్ల ను స్వాధీనం చేసుకొని ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించడం, ఐదేళ్ల రికార్డులను సీజ్ చేసి ఆ శాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్న విషయాలను కూడా ఈ కథనంలో తెలియచేసింది. దీంతో ‘మూడుగ్రూపులతో ప్లాన్ అమలు’ అంటూ ఫిబ్రవరి 25వ తేదీన ‘మనతెలంగాణ దినపత్రిక’లో మరో కథనాన్ని ప్రచురించింది. మూడు గ్రూపులను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను అప్పటి సిఎస్ సోమేష్‌కుమార్, ఐఐటీ ప్రొఫెసర్లు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో కలిసి ఈ అవినీతిని ఎలా చేశార న్న విషయాలను అదే నెల 25వ తేదీన మరో కథనంలో ‘మనతెలంగాణ దినపత్రిక’ తెలియచేసింది.

అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే..
ఇప్పటివరకు ఐదుగురిపై కేసులను నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు త్వరలోనే నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. 75మంది పన్ను చెల్లింపుదారులకు బెనిఫిట్ చేసేందుకు వారి పేర్లను ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ కుంభకో ణం వల్ల ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల మేర నష్టం వా టిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిన వారిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని, మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
వాట్సాప్ గ్రూపులకు సమాచారం చేరేలా..
కమర్షియల్ ట్యాక్స్ , ఐఐటీ హైదరాబాద్‌ల మధ్య జరిగిన లావాదేవీలను కూడా అప్పట్లో సోమేష్‌కుమార్‌తో పాటు పలువురు ఆ చెందిన అధికారులు పక్కదారి పట్టించినట్లు ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూపునకు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని, ఆ గ్రూప్‌లో మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. తెలంగాణ బేవరెజస్ కార్పొరేషన్‌లోని కొన్ని కంపెనీల వల్ల కమర్షియల్ ట్యాక్స్ వేయి కోట్లు నష్టం వాటిల్లడంతో పాటు మరో 11 ప్రైవేటు సంస్థలు కూడా ఇలా రూ.400 కోట్ల వరకు ప న్నులు ఎగవేసినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు.

మరికొంతమందికి నోటీసులు
ఈ కేసులో మరికొంత మందికి సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ కేసు లో ఏ -5గా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సిఎస్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కా శీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్ర సాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, జిఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన ప్లింటో టెక్నాలజీపై కూడా కేసు న మోదయ్యింది. ఈ నేపథ్యంలోనే సిసిఎస్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది. ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రూ.1,000 కోట్లు స్కాం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతోపాటు మాజీ సిఎస్ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లుగా అధికారులు గుర్తించడంతో ఈ స్కాంకు పాల్పడ్డ నిందితులపై ఐపిసి, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. అసెంబ్లీ సెషన్ పూర్తి కాగానే ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని సిసిఎస్ పోలీసులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News