Wednesday, December 25, 2024

కౌశిక్ రెడ్డీ దురహంకారం తగ్గించుకో: సీతక్క

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క ఘాటుగా బదులిచ్చారు. శాససన సభలో సోమవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై జరిగిన చర్చ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సీతక్కకు ఏమీ తెలియదని, ఆమెకు నాలెడ్జ్ లేదని చెప్పడంతో పెద్ద దుమారం రేగింది. స్పీకర్ సహా మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీతక్క లేచి మాట్లాడుతూ ఒకవైపు బస్సులు పెంచాలంటూనే, మరో వైపు ఆటో వాలాలపై మొసలి కన్నీరు కారుస్తున్న కౌశిక్ రెడ్డి నీ దురంహకార్నిన తగ్గించుకో, నీలా దర్మార్గమైన నాలెడ్జ్ నాకు లేదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే నాలెడ్జ్ మాత్రమే నాకుందంటూ మంత్రి వ్యాఖ్యానించారు. దూర ప్రాంతాల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు బాగానే నడుస్తున్నాయని, బస్సులు పెంచి ఆటో కార్మికుల పొట్ట కొట్టాలా? ఆటో వాళ్లను రెచ్చగొట్టే రాజకీయం వద్దంటూ హితవు పలికారు. మహిళలకు పథకాలు ఇవ్వాలా, ఇవ్వద్దా చెప్పండంటూ ప్రశ్నించారు.

ఉచిత బస్సు ప్రయాణం పట్ల విపక్షాల ఎమ్మెల్యే ధ్వంధ వైఖరిని ప్రదర్శిస్తున్నారని, అసలు ఉచిత బస్సు ప్రయాణంపై మీ వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని, వారికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు సౌకర్యంతో ఇబ్బందులు ఉన్నాయని, అవన్నీ మంత్రి సీతక్కకు తెలియదని, ఆమెకు నాలెడ్జ్ లేదని కౌశిక్ రెడ్డి అన్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహిళా సభ్యురాలిని అలా అనడం సరికాదని, వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పాలని సూచించారు. మంత్రి సీతక్క పై చేసిన వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటున్నట్లు కౌశిక్ రెడ్డి స్పీకర్‌కు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News