Sunday, December 22, 2024

ఛత్తీస్‌గఢ్‌లో 14 మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సోమవారం 14 మంది నక్సలైట్లు భద్రత దళాల ముందు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వారిలో ఒకరిపై లక్ష రూపాయల రివార్డ్ ఉంది. సీనియర్ కేడర్‌ల అత్యాచారాలు, ‘అమానుష’, ‘డొల్ల’ మావోయిస్ట్ సిద్ధాంతం పట్ల నిరాశ చెందామని పేర్కొంటూ నక్సలైట్లు బీజాపూర్‌లో పోలీసులు, సిఆర్‌పిఎఫ్ ముందు లొంగిపోయినట్లు బీజాపూర్ ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ తెలియజేశారు.

వారు మావోయిస్టుల ఉసూర్-పామెడ్, భైరామ్‌గఢ్, గంగలూర్ ఏరియా కమిటీల్లో క్రియాశీలురని ఆయన తెలిపారు. వారిలో 38 ఏళ్ల మహిళా కేడర్ మరుబడ్క గ్రామంలో క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ (కెఎఎంఎస్) సారథిగా చురుకుగా కార్యకలాపాలు సాగిస్తుంటుందని, ఆమెపై లక్ష రూపాయల రివార్డ్ ఉందని ఎస్‌పి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు, పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన నక్సలైట్లకు సౌకర్యాలు కల్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News