Friday, September 20, 2024

కోచింగ్ సెంటర్ మృతులకు రూ. 10 లక్షల నష్టపరిహారం

- Advertisement -
- Advertisement -

దేశ రాజధానిలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఒక కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు ముంచెత్తడంతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సివిల్ సర్వీసెస్ ఆశావహుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జి) వికె సక్సేనా సోమవారం ప్రకటించారు. ఈ విషాద ఘటనపై నిరసన తెలియచేస్తున్న విద్యార్థులను కలుసుకున్న ఎల్‌జి 24 గంటల్లోపల ఇందుకు బాధ్యులైన ఢిల్లీ అగ్ని మాపక సర్వీసు,

పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రాజ్ నివాస్ ఒక ప్రకటనలో తెలిపింది. మృతి చెందిన ముగ్గురు సివిల్ సర్వీసెస్ ఆశావహులకు రూ. 10 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ఎల్‌జి ప్రకటించినట్లు ప్రకటనలో తెలిపారు. భవన నిబంధనలను ఉల్లంఘించిన అన్ని అక్రమ కట్టడాలను, బేస్‌మెంట్లను మూసివేస్తామని ప్రకటనలో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News