Friday, December 20, 2024

డబుల్ ఇస్మార్ట్ నుంచి రొమాంటిక్‌గా ’క్యా లఫ్డా…’

- Advertisement -
- Advertisement -

డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి మొదటి రెండు సింగిల్స్ ఆడియన్స్ ని అద్భుతంగా అలరించి వైరల్ హిట్స్ అయ్యాయి. లీడ్ పెయిర్ రామ్ పోతినేని, కావ్య థాపర్‌ల థర్డ్ సింగిల్ ‘క్యా లఫ్డా…’ విడుదలతో ఈ మాన్‌సూన్ మరింత రొమాంటిక్‌గా మారింది. క్యా లఫ్డా ఒక అద్భుతమైన ట్రాక్. డైనమిక్ వోకల్స్‌తో పర్ఫార్మెన్స్ టెక్నో బీట్‌లను అద్భుతంగా బ్లెండ్ చేశారు సంగీత దర్శకుడు మణి శర్మ. క్యా లఫ్డా ఎంజాయ్‌బుల్‌గా మాత్రమే కాకుండా మరచిపోలేని అనుభూతిని అందిస్తోంది.

ఈ సీజన్‌లో రొమాంటిక్ మెలోడీగా ’క్యా లఫ్డా’ రామ్, కావ్యా థాపర్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని చూపించింది. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News