Friday, September 20, 2024

లోక్ సభలో అనురాగ్ ఠాకుర్ పై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం లోక్ సభలో బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకుర్ పై విరుచుకుపడ్డారు. తనను అవమానించారని మండిపడ్డారు. అనురాగ్ ఠాకుర్ ‘‘ఎవరికైతే తమ కులం కూడా తెలియదో వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారు’’ అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘ఎవరైతే ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వారికి సంబంధించిన సమస్యలు లేవనెత్తుతారో వారిని కించపరుస్తున్నారు’’ అన్నారు.

“కులం తెలియని వారు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ( RG-1)  OBCలకు రిజర్వేషన్‌ను వ్యతిరేకించారని నేను స్పీకర్‌కు గుర్తు చేయాలనుకుంటున్నాను” అని బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ సభలో అన్నారు.

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని దేశానికి హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. “మీరు ఎంత కావాలనుకుంటే అంతగా నన్ను అవమానించవచ్చు,  కానీ మేము పార్లమెంటులో కుల గణనను పాస్ చేస్తాము” అని రాహుల్ గాంధీ అన్నారు. తర్వాత ఠాకూర్ తన వ్యాఖ్యల్లో ఎవరి పేరును ప్రస్తావించలేదని చెప్పారు.

‘‘కులం గురించి తెలియని వ్యక్తి కుల గణన గురించి మాట్లాడుతున్నారని నేను అన్నాను, కానీ నేను ఎవరి పేరు ప్రస్తావించలేదు’’ అని అనురాగ్ ఠాకుర్ తెలిపారు.  కానీ తర్వాత రాహుల్ గాంధీ , ఠాకూర్ తనను దుర్భాషలాడారని, అవమానించారని ఆరోపించారు. అయితే ఆయన నుంచి తాను క్షమాపణలు కోరుకోవడం లేదన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీల్లో కుల గణన ఒకటి. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ దీనిని భారతదేశం యొక్క ఎక్స్-రే అని పిలిచారు.

“ దేశంలో ఎంత మంది వెనుకబడినవారు, దళితులు, గిరిజనులు ఉన్నారో ఎవరికీ తెలియదా?  జనాభాలో అత్యధికంగా ఉన్న వారికి వారి సంఖ్య తెలియదు. బిజెపి ప్రభుత్వానికి కులాల డేటా అక్కర్లేదు. కానీ  వివిధ కుల సమూహాల జనాభాను నిర్ధారించడానికి మేము భారతదేశం యొక్క ఎక్స్-రేను పొందుతాము. కుల గణన పూర్తయితే దేశం మారిపోతుంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. కాగా కుల ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News