Wednesday, April 2, 2025

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి తల్లి, బిడ్డ మృతి

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లోని అమెంగ్లాంగ్‌జిల్లాలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో ఒక తల్లి, ఆమె సపికందు మరణించారు. దింతన్‌లాంగ్ జిల్లాలో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడడంతో ఇల్లు కొట్టుకుపోయి ఒక కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు వారు చెప్పారు. చికిత్స కోసం కానిస్టేబుల్‌ను ఇంఫాల్‌కు తీసుకువచ్చినట్లు వారు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి మణిపూర్‌లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News