Thursday, September 19, 2024

మను మరో చరిత్ర

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ రెండో పతకం గెలుచుకుంది. మంగళవారం షూటింగ్‌లో భారత్‌కు చెందిన మను బాకర్‌సరబ్‌జ్యోత్ సింగ్ జోడీ కాంస్య పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మను బాకర్‌సరబ్‌జ్యోత్ సింగ్ జంట 16 పాయింట్లతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ ఒలింపిక్స్‌లో మను బాకర్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కూడా మను కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో స్వాతంత్ర భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా మను బాకర్ చరిత్ర సృష్టించింది. 1900లో ఆంగ్లోఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. ఆ తర్వాత ఓ భారత ఒకే ఒలింపిక్స్‌లో ఇలాంటి ఘనత సాధించడం ఇదే తొలిసారి.

ఇక మంగళవారం కాంస్యం కోసం జరిగిన పోరులో మనుసరబ్‌జ్యోత్ జోడీ అద్భుత ఆటను కనబరిచింది. ఒత్తిడిని దరిచేరకుండా లక్షం దిశగాఅడుగులు వేసింది. దక్షిణ కొరియాకు చెందిన లియెజిన్ జంట పోటీని తట్టుకుంటూ మను జోడీ ముందుకు సాగింది. ఇదే క్రమంలో 16 పాయింట్లను సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కొరియా జంట 10 పాయింట్లు మాత్రమే సాధించి పతకం గెలిచి ఛాన్స్ కోల్పోయింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు రెండు పతకాలు లభించాయి. మహిళల వ్యక్తిగత షూటింగ్‌తో పాటు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ ఈ పతకాలు సాధించింది. మరోవైపు చారిత్రక ప్రదర్శనతో కాంస్య పతకం సాధించిన మనుసరబ్‌జ్యోత్ జోడీపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు ఈ జంటను అభినందించారు. అంతేగాక సోషల్ మీడియా వేదికగా మను బాకర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News