Monday, December 23, 2024

సూపర్ ఓవర్ తో సూపర్ గెలిచారు… బౌలింగ్ లో మెరిసిన సూర్య, రింకు

- Advertisement -
- Advertisement -

పల్లెకలె: శ్రీలంకతో జరిగిన మూడ టి20లో భారత జట్టు విజయం సాధించడంతో సిరీస్ ను 3-0 కైవసం చేసుకుంది. మూడో టి20లో సూపర్ ఓవర్ లోగెలిచింది. చివరి టి20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీలంక 138 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 137 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా మారింది. సూపర్ ఓవర్ లో లంక రెండు వికెట్లు కోల్పోయి రెండు పరుగులు చేసింది. సూపర్ ఓవర్ లో సూర్య కుమార్ తొలి బంతినే ఫోర్ కొట్టడంతో టీమిండియా గెలిచింది.

వర్షం వల్ల మ్యాచ్ దాదాపు గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10), శాంసన్ (0), రింకు సింగ్ (8), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశ పరిచారు. అయితే శుభ్‌మన్ గిల్ (39) జట్టుకు అండగా నిలిచాడు. చివర్లో రియాన్ పరాగ్ (26), సుందర్ (25) రాణించడంతో భారత్ మెరుగైన స్కోరును సాధించింది. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. అతను మూడు వికెట్లను పడగొట్టాడు.

శ్రీలంక తొలుత బ్యాటింగ్ ధాటిగా చేసింది. 15.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. 4.8 ఓవర్లలో 28 పరుగులు లంక గెలిచేది. కానీ వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, సూర్యకుమార్ చివరి ఓవర్లలో ఆరు వికెట్లు తీసి లంక నడ్డి విరిచారు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్ లో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్ కైవస్ చేసుకుంది. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయడంతో పాటు 25 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను వశం చేసుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News