Friday, December 20, 2024

పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వం రద్దు

- Advertisement -
- Advertisement -

ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) బుధవారం ప్రకటించింది. భవిష్యత్తులో ఆమె అన్ని యుపిఎస్‌సి పరీక్షలు లేదా ఎంపికలలో పాల్గొనేందుకు అవకాశం లేకుండా ఆమెపై యుపిఎస్‌సి శాశ్వతంగా నిషేధం విధించింది. అందుబాటులో ఉన్న అన్ని రికార్డులను యుపిఎస్‌సి పరిశీలించి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్(సిఎస్‌ఇ)-2022 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని గుర్తించినట్లు యుపిఎస్‌సి ఒక ప్రకటనలో తెలిపింది. సిఎస్‌ఇ-2022 కోసం ఆమె ప్రొవిజినల్ క్యాండిడేచర్‌ను రద్దు చేసినట్లు యుపిఎస్‌సి తెలిపింది. భవిష్యత్తులో అన్ని యుపిఎస్‌సి పరీక్షలు లేదా ఎంపికల నుంచి ఆమెను శాశ్వతంగా బహిష్కరించినట్లు తెలిపింది.

నకిలీ పత్రాల ద్వారా తన గుర్తింపును సమర్పించి మోసపూరితంగా పరిమితికి మించి పరీక్షలను రాసినందుకు పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్‌కు జులై 18న షోకాజ్ నోటీసు అందచేసినట్లు యుపిఎస్‌సి తెలిపింది. జులై 25లోగా తన సమాధానాన్ని అందచేయాలని ఆదేశించగా అవసరమైన పత్రాలు సేకరించుకోవడానికి తనకు ఆగస్టు 4 వరకు గదువు ఇవ్వాలని పూజా ఖేడ్కర్ కోరినట్లు యుపిఎస్‌సి తెలిపింది. అయితే చివరి అవకాశంగా జులై 30 సాయంత్ర 3.30 గంటల లోగా తన సమాధానాన్ని అందచేయాలని ఆదేశించగా గడువులోపల సంజాయిషీని సమర్పించడంలో ఆమె విఫలమయ్యారని యుపిఎస్‌సి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News