- Advertisement -
బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించినప్పటికీ ఆ వ్యాఖ్యలున్న వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేసిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపి చరణ్‌జిత్ సింగ్ చన్ని బుధవారం సభా హక్కుల తీర్మానానికి నోటీసు అందచేశారు. మంగళవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయగా వీటిని సభాధ్యక్షుడు రికార్డుల నుంచి
తొలగించారు. ఈ వ్యాఖ్యలపై సభలో తీవ్రస్థాయిలో రభస జరిగింది. కాగా..రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్టు చేయడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఎంపి చన్ని లోక్‌సభ స్పీకర్‌కు ప్రధానిపై హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ నోటీసును సమర్పించారు.
- Advertisement -