Friday, December 20, 2024

బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

లింగంపేట్ మండలంలోని గాంధీనగర్ గ్రామం వద్ద బుధవారం ఉదయం ఆర్టీసి బస్సు ఆటోను ఓవర్‌ టేక్ చేయబోయి ముందు  వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు . లింగంపేట్ మండలం పొల్కంపేట్ గ్రామానికి చెందిన చాకలి భూమయ్య చాకలి నరెందర్ కామారెడ్డి నుండి పొల్కంపేట్ గ్రామంలో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గాంధీనగర్ మూల మలుపు వద్ద కామారెడ్డి వైపు వెళుతున్న ఆర్టీసి అద్దె  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ చాకిలి భూమయ్య, చాకిలి నరెందర్‌కు గాయాలు కాగా 108 ఆంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

మరో ఘటనలో

మండల కేంద్రంలోని పోచంపాడ్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై  ఆర్టీసి బస్సు అదుపు తప్పింది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం నిజామాబాద్ రెండవ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుండి నిర్మల్‌కు ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఉదయం ఎనిమిది గంటల సమయంలో జాతీయ రహదారి 44 మధ్యలో ఎర్పాటు చేసిన డివైడర్‌ను ఢీ కోట్టడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురి అయ్యారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News