మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ వార్షిక బడ్జెట్ సమావేశాలు చివరిదశకు చేరుకున్నా యి. బుధవారం సభలో ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టగా బిఆర్‌ఎస్ సభ్యుల నిరసనల మధ్యే ఈ బిల్లు సభలో ఆమోదం పొందింది. దీంతో స్పీ కర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభను గురువా రం ఉదయం 10గంటలకు వాయిదా వేశారు. అంతకు ముందు ఉదయం సమవేశాలు ప్రశాం త వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉద్యోగాలు మూసీనది సుందరీకరణ తదితర అంశాలపైన బిఆర్‌ఎస్ సభ్యుడు కెటిఆర్ రాష్ట్రప్రభుత్వం పై విమర్శలదాడి చేశారు. పలు మార్లు ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ ఇరుకున పెట్టే ప్ర యత్నం చేశారు. పరిస్థిని గమనించిన మంత్రలు కెటిఆర్ విమర్శలు ఆరోపణలను తిప్పికొట్టారు.
రేవంత్‌రెడ్డి సర్కారు పదినేలల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కెటిఆర్ ఆరోపించ గా, పదేళ్లబిఆర్‌ఎస్ పాలనలో మీరేం చేశారం టూ కేటిఆర్ ఆరోపణలను తిప్పికొట్టారు.మూసినది సుందరీకరణపైనా మాటల యుద్దం నడిచిం ది. నిమిషాలు గడుస్తున్న కొలదీ అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదలతో అసెంబ్లీ వేడెక్కిపోయింది. ఒక దశలో సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు చేసిన ప్రయత్నంలో బిఆర్‌ఎస్‌పార్టీ సభ్యులకు అధికార పక్ష సభ్యులకు మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు జరిగాయి. ఇరు పక్షాల మధ్య మాటల యుద్దం సభను ఉడుకెత్తించింది.
స్పీకర్ ఆగ్రహం
బిఆర్‌ఎస్ పక్ష సభ్యలకు సభలో రెండు గంటలు మాట్లాడేందుకు సమయం ఇచ్చినప్పటికి చైర్‌కు గౌరవం ,మర్యాద ఇవ్వటం లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిఆరెఎస్ సభ్యుల తీరుపై ఆగ్ర హం వెలిబుచ్చారు.రెచ్చేగొట్టే తీరు సరైన పద్దతి కాదని హితవు చెప్పారు. సభలో మాట్లడేందకు ఇంత అవకాశం ఇచ్చినా ఇంకా నిరసనలు చేయ డం సరైన పద్దతి కాదని హితవు పలికారు.