Friday, November 22, 2024

ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీం కీలక తీర్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసుకోవచ్చని సిజెఐ జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.  6:1 మెజారిటీతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది ఒక్కరే వ్యతిరేకించారు. పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఆర్‌పిఎస్ ఉపవర్గీకరణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయవద్దన్న నాటి తీర్పును కోర్టు కొట్టివేసింది. 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News