హైదరాబాద్: కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. రేపే అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. త్వరలో తెల్ల రేషన్ కార్డులు ప్రారంభిస్తామన్నారు. రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామన్నారు.
తెలంగాణ ఖ్యాతి పెంచిన క్రీడాకారులు ఇషాసింగ్, నిఖత్, సిరాజ్ లకు 600 గజాల స్థలం ఇస్తామన్నారు. విధుల్లో ఉండగా చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. మరో అధికారి మురళి కుమారుడికి గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేరళకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందని పొంగులేటి వివరించారు.
Hon’ble Minister Sri.Ponguleti Srinivas Reddy will Address the media https://t.co/ODAyddBzQW
— Telangana Congress (@INCTelangana) August 1, 2024