Friday, December 20, 2024

రేవంత్ నీ సిఎం పదవి పోయే ఛాన్స్ ఉంది: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శాసన సభలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డిని సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అవమానించారని ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. క్షమాపణలు చెప్పమంటే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎపై ఎదురుదాడికి దిగారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిఎం రేవంత్ పలుమార్లు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల సభ్యత్వాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని, రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లిన తరువాత ఆయన సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖమ్మం లేదా నల్లగొండ నేతలు రేవంత్ పదవిని లాక్కునే అవకాశం ఉందని, చిట్‌చాట్‌లో కొందరు మంత్రులు ఇదే విషయాన్ని చెబుతున్నారని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలని కౌశిక్ రెడ్డి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News