Saturday, November 23, 2024

ఆ సిక్స్‌లు ట్వీట్… పాక్‌కు అందుకే రావడం లేదన్న జర్నలిస్ట్… ఘాటుగా రిప్లై ఇచ్చి భజ్జీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాము రక్షణ కల్పిస్తామని, పాక్‌కు వచ్చి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలని పాకిస్తాన్ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ కు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించారు. పాక్‌కు భారత జట్టు వెళ్లకపోవడమే మంచిదని, బిసిసిఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని సింగ్ తెలిపారు. హర్భజన్ సింగ్‌లో బౌలింగ్ షాహిద్ ఆఫ్రిది సిక్స్, ఫోర్ కొట్టిన వీడియోను ఫరీద్ ఖాన్ అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో పాటు ఇందుకేనా భారత జట్టు పాక్‌కు రావడంలేదని, భద్రతా కారణాలు చూపిస్తున్నారని అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుపై సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.

టీమిండియా పాకిస్థాన్‌కు రాకపోవడానికి జర్నలిస్ట్ అనుకున్న కారణం కాదు అని, క్రికెట్‌లో గెలుపోటములు సహజమన్నారు. సరైన కారణం తాను చెబుతానని, తాను షేర్ చేసిన ఫొటోను గుర్తు పట్టారా? ఎఫ్ అని ప్రశ్నించారు. ఎఫ్ అంటే ఏదో అనుకోకండి, అది మీ పేరు ఫరీద్ ఖాన్ అని చురకలంటించారు. 2009లో పాకిస్తాన్‌లో ఆడుతున్న శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు అడేందుకు పలు దేశాలు విముఖత చూపించాయి. దీంతో పాక్‌కు వెళ్లేందుకు భారత్ కూడా నిరాకరించింది. ఐసిపి వరల్డ్ కప్, ఆసియా కప్‌లో మాత్రమే పాక్‌తో భారత్ క్రికెట్ ఆడుతోంది. పాక్‌లో నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫికి టీమిండియా వెళ్లడం లేదని బిసిసిఐ కార్యదర్శి జైషా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News