- Advertisement -
ఉప్పల్: హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడికి యత్నించినట్టు సమాచారం. విద్యార్థిని తల్లిదండ్రులు ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థిపై చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపాల్ జోసెఫ్ తెలిపారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Advertisement -