Friday, December 20, 2024

హైదరాబాద్‌లో తిరగనియ్యం కొడకల్లారా.. తోలు తీస్తా: దానం ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు
దానం మాటలతో ఆందోళనకు దిగిన బిఆర్‌ఎస్ నాయకులు
వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న ఎమ్మెల్యే నాగేందర్
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో హైదరాబాద్ నగర పరిస్థితిపై మాట్లాడుతుండగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గోల చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్ ‘మీరు ఇలాగే ప్రవర్తిస్తే హైదరాబాద్‌లో తిరగనియ్యం కొడకల్లారా.. తోలు తీస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటకాలు ఆడుతుతున్నారా? అంటూ ఆవేశంగా మాట్లాడారు.

దానం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేశారు. ఇది మంచి సంప్రదాయం కాదని తక్షణమే దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనను కవ్వించారని, అయినా తన పరిధిలోనే మాట్లాడానని, తాను మాట్లాడిన మాటలు సభలోని సభ్యులకు బాధ కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన సభ ముందు తెలిపారు.

ఆ పదాలు సర్వసాధారణంగా వస్తుంటాయి…
ఆ పదాలు సర్వసాధారణంగా వస్తుంటాయని, గతంలో తాను ఎప్పుడు నోరు జారలేదని, సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే వాళ్లే తనను దూషించారన్నారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ అడుగుతున్నానని దానం నాగేందర్ అక్బరుద్దీన్ డిమాండ్‌కు స్పందించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దానం వ్యాఖ్యలను పరిశీలించి అవసరమైతే రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.

హైదరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలతో శాసనసభలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్ పోడియం ఎదుట బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News