- Advertisement -
పారిస్: ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాన్ని భారత ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ తృటిలో చేజార్చుకున్నారు. శుక్రవారం ఆర్చరీ మిక్స్‌డ్ డబుల్స్ కాంస్య పతకం కోసం జరిగిన పోరులో తెలుగు కుర్రాడు బొమ్మరదేవర ధీరజ్, అంకిత భకత్ ద్వయం పరాజయం చవిచూసింది.
కాంస్య పతకం బరిలోకి దిగిన ధీరజ్, అంకిత ద్వయం పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. అమెరికా జంటతో జరిగిన పోరులో ధీరజ్ జోడీ 26 తేడాతో ఓటమి పాలైంది. దీంతో పతకం సాధించే అవకాశాన్ని ఈ జంట కోల్పోయింది.
- Advertisement -