Saturday, November 23, 2024

సోమాలియాలో ఉగ్రదాడి: 32 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మొగడిషు: సోమాలియాలో హోటల్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. మొగడిషులోని లీడో బీచ్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో 32 మంది మృతి చెందగా 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. భద్రతా బలగాలు మరో ముగ్గురు తీవ్రవాదులను కాల్చి చంపాగా ఒకరిని పట్టుకున్నారు. ఎక్కువ మంది గుంపుగా ఉన్నచోట ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. దాడికి తామే బాధ్యులమని అల్‌ఖైదా అనుబంధం సంస్థ ప్రకటన చేసింది. గత సంవత్సరంలో ఇదే బీచ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News