Wednesday, January 15, 2025

భర్త మృతదేహం రోడ్డుపై…. వైద్యురాలు శవం ఇంట్లో… అసలు ఏం జరిగింది

- Advertisement -
- Advertisement -

ముంబయి: భర్త మృతదేహం రోడ్డుపై ఉండగా ఇంట్లో భార్య రక్తపు మడుగులో కనిపించిన సంఘటన మహారాష్ట్రలోని గోరెగావ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జవహర్ నగర్‌లో ఓ అపార్టుమెంట్‌లో కిషోర్ పడ్నేకర్ అనే వ్యక్తి తన భార్య రాజశ్రీతో కలిసి ఉంటున్నాడు. రాజశ్రీ ఫిజియోథెరపిస్టుగా పని చేస్తోంది. కిషోర్ జిమ్ సామాగ్రి అమ్మే షాప్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ దంపతుల కుమారుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. కిషోర్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచార మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో అతడు చనిపోయాడు.

వెంటనే పోలీసులు అతడి ఫోన్ నుంచి ఆయన భార్యకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో శవంతో ఇంటికెళ్లారు. ఇంటి లోపలి వైపు తాళం వేసి ఉండడంతో బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేశారు. రూమ్‌లో భార్య రక్తపు మడుగులో కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెందిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఒత్తిడిని కంట్రోల్ చేసే ఔషదాలు కనిపించాయి. ఒత్తిడి కారణంతో భార్యను భర్త హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News