Thursday, September 19, 2024

కారం మెతుకులతో మధ్యాహ్న భోజనమా?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కారం మెతుకులతో పెట్టడం అమానుషమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు పేర్కొన్నారు.ఈ మేరకు ఎక్స్‌లో కారం మెతుకులతో భోజనం పట్టుకున్న విద్యార్థుల ఫొటోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారని, ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం,

ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని ఆరోపించారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని హరీశ్‌రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News