Saturday, January 11, 2025

మోడీ ముందు నాభర్త తలవంచరు : సునీతా కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినందువల్లనే తన భర్త కేజ్రీవాల్ జైలు పాలయ్యారని సునీతా కేజ్రీవాల్ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని, ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ ముందు నాభర్త తలవంచరని సునీతా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మెరుగైన ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లు, ప్రభుత్వ పాఠశాలలు, ఉచిత విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను దేశం లోని ఏ పార్టీ కల్పించడం లేదని ఆమె ఉదహరించారు. ఈ అభివృద్ధి పనులను కేజ్రీవాల్ మాత్రమే చేశారని, మోడీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నారని విమర్శించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హర్యానా లోని సోహ్నాలో బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. కేంద్రం లోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News