Monday, December 23, 2024

సిఐ ఇంట్లో బర్త్ డే వేడుకలు… భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలోని దేవి నగర్ లో సిఐ శేఖర్ ఇంట్లో బర్త్ డే పార్టీ జరుగుతుండగా ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిఐ శేఖర్ ఇంట్లో బర్త్ డే వేడుకల కోసం 30 మంది స్నేహితులు అతడి ఇంటికి వెళ్ళారు. 30 మందిలో 10 మంది పోలీసులు కూడా ఉన్నారు. బర్త్ డే పార్టీ జరుగుతుండగా మూడవ అంతస్తు నుండి బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ఘటన స్థలంలోనే అతడు మృతి చెందాడు. డిన్నర్ చేస్తుండగా మూడవ అంతస్తు నుండి అతడు పడిపోయినట్టు సమాచారం. పార్టీ ఇచ్చిన శేఖర్ రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు 194 బిఎఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News