Monday, December 23, 2024

బంగ్లాదేశ్ సంక్షోభం.. మోడీతో జైశంకర్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని బంగ్లాదేశ్ పరిణమాలను వివరించారు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా లండన్‌కు వెళుతూ ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ వద్ద నున్న హిండన్ విమానాశ్రయంలో ఆగారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీని కలుసుకున్న జైశంకర్ పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. అయితే ఈ సమావేశం గురించి అధికారిక ప్రకటనేదీ రాలేదు.

కాగా..బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్ హసీనా రాజీనామా దరిమిలా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను పార్లమెంట్ హౌస్‌లో కలుసుకుని తాజా పరిస్థితిని చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News