Friday, November 22, 2024

బంగ్లాదేశ్ నుంచి నేరుగా భారత్‌కు వచ్చిన హసీనా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఢిల్లీకి సమీపాన హిండాన్ వైమానిక స్థావరం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రం కావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె భారత్‌కు విమానంలో బయలుదేరి రావడం విశేషం.

ఆమెతోపాటు ఆమె సోదరి కూడా ఉన్నారు. హసీనాకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఎఒసి) సంజయ్ చోప్రా స్వాగతం పలికారు. ఆ తరువాత భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హిండాన్ వైమానిక స్థావరం వద్ద హసీనాను కలుసుకున్నారు. భారత్ ఎప్పుడూ షేక్ హసీనాను ఆత్మీయ మిత్రునిగానే గౌరవిస్తోంది. అవామీలీగ్ పాలనలో బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలను నెరపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News