Friday, December 20, 2024

క్వార్టర్ ఫైనల్లో నిశా ఓటమి

- Advertisement -
- Advertisement -

పారిస్: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో షాక్ తగిలింది. మహిళల రెజ్లింగ్‌లో నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. మహిళల 68 కిలోల ప్రిస్టయిల్ విభాగం క్వార్ట్ ఫైనల్లో నిశా పరాజయం చవిచూసింది. ఉత్తర కొరియా రెజ్లర్ సోల్ గమ్‌తో జరిగిన పోరులో నిశా 810 తేడాతో కంగుతిన్నది. ఒక దశలో సునాయాసంగా విజయం సాధిస్తుందని భావించిన నిశాకు గాయం ప్రతికూలంగా 82 ఆధిక్యంలో ఉన్న సమయంలో నిశా గాయానికి గురైంది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో నిశా పట్టును కోల్పోయింది. నొప్పితో విలవిల్లాడి కన్నీటి పర్యంతరమైన నిశా బౌట్‌ను కొనసాగించింది. అయితే గాయం వల్ల సరిగ్గా ఆడలేక ఓటమి చవిచూసింది. దీంతో సెమీస్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News