- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో సినిమా డైరెక్టర్ కొమరి జానయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. భాగ్య నగర్ కాలనీలోని ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో జానయ్య(44) ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో జానయ్య డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -