Monday, December 23, 2024

టీమిండియాకు పరీక్ష.. నేడు లంకతో చివరి వన్డే

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంకతో బుధవారం జరిగే మూడో వన్డే భారత్‌కు చావోరేవోగా మారింది. ఇప్పటికే రెండో వన్డేలో గెలిచిన శ్రీలంక సిరీస్‌లో 10 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి టీమిండియాకు నెలకొంది. కిందటి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పోయింది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయస్‌ల వైఫల్యం భారత్‌ను వెంటాడుతోంది.

ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తారా లేదా అనేది సందేహంగా మారింది. బౌలర్లు బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇక శ్రీలంక ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. చివరి వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్‌కు మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News