Saturday, December 21, 2024

ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళకు చెందిన వ్యాపారవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహాత సుందర్ సి మీనన్‌ను, త్రిసూర్ జిల్లాలో ఆర్థిక మోసం ఆరోపణలపై అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. రాష్ట్ర పోలీస్ జిల్లా క్రైమ్ బ్రాంచ్ విభాగం అతన్ని ఆదివారం అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టు రిమాండ్ విధించిన తరువాత జిల్లా జైలుకు పంపారు.

2016లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన మీనన్, తాను డైరెక్టర్లలో ఒకరిగా రెండు సంస్థల పేరుతో వ్యక్తుల నుంచి డిపాజిట్లు స్వీకరించినందుకు 18 ఆర్థిక మోసాల కేసులను ఎదుర్కొన్నాడు. నిందితుడు 62 మందికి పైగా ఇన్వెస్టర్ల నుంచి డిపాజిట్టు రూ.7.78 కోట్లు వరకు సేకరించి, రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిబంధనలను ఉల్లంఘించి , మెచ్యూరిటీ వ్యవధి ముగిసినా తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని పోలీస్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News