- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల కోసం భారీ ఆర్థిక సాయం ప్రకటించాడు. కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళమిచ్చారు. ఈ మేరకు ప్రభాస్ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వయనాడ్ బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ రూ.50 లక్షలు, మోహన్ లాల్ రూ.3 కోట్లు, నయనతార దంపతులు రూ.50 లక్షలు, చిరంజీవి, రామ్‌చరణ్ కలిపి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు విక్రమ్, మమ్ముట్టి వంటి స్టార్స్ కూడా విరాళాలు ఇచ్చారు.
కాగా ఇటీవల వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘనలో 250మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా..500కు పైగా ప్రజలు తల్లంతయ్యారు. సంఘటనాస్థలాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -