Thursday, September 19, 2024

ఢాకా నుంచి ఢిల్లీకి 205 మంది తరలింపు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ఎయిర్ ఇండియా బుధవారం ప్రత్యేక విమాన సర్వీసును నడిపి ఆరుగురు చిన్నారులతో సహా 205 మంది ప్రయాణికులను ఢిల్లీకి తరలించింది. ఎ 321 ప్రత్యేక విమానం ద్వార ఢాకా నుంచి 205 మంది ప్రయాణికులను తీసుకువచ్చినట్లు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఖాళీగా వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢాకా నుంచి బయల్దేరినట్లు ఆయన చెప్పారు. ఢాకాలోని విమానాశ్రయంలో మౌలిక సౌకర్యాలకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ అతి స్వల్ప నోటీసులో ఢిల్లీ నుంచి విమానాన్ని పంపించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి ఢాకాకు రోజూ నడిచే రెండు విమాన సర్వీసులను బుధవారం నుంచి ఎయిర్ ఇండియా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.

మంగళవారం ఎయిర్ ఇండియా ఢాకాకు ఉదయం నడిచే సర్వీసును రద్దు చేసినప్పటికీ, సాయంత్రం సర్వీసును నడిపినట్లు ఆయన చెపారు. కాగావిస్తారా, ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా షెడ్యూల్ ప్రకారం ఢాకాకు తమ విమాన సర్వీసులను నడుపుతున్నాయి. ముంబై నుంచి ఢాకాకు ప్రతిరోజు నడిపే విమాన సర్వీసులతోపాటు ఢిల్లీ నుంచి ఢాకాకు వారానికి మూడు సర్వీసులను విస్తారా ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి ఢాకాకు ప్రతిరోజు సర్వీసులతోపాటు కోల్‌కత నుంచి రోజుకు రెండు సర్వీసులను నడుపుతోంది. విస్తారా, ఇండిగో మంగళవారం ఢాకాకు తమ సర్వీసులను నిలిపివేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News