తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ రెండురోజులు ఉరుములు, మెరుపులు,
గంటకు 30- నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా గడిచిన 24గంటల్లో ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా ఘట్టులో 126 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.